ప్రాంతీయం

సర్పంచికి ప్రశంసల హర్షం.. శాల్వాతో సన్మానం…

118 Views

ముస్తాబాద్, జనవరి 10 (24/7న్యూస్ ప్రతినిధి) రైతులపట్ల గ్రామ అభివృద్ధిపట్ల తనవంతు కృషిచేస్తూ ఇటు సర్పంచ్ గా గెలుపొందడంతో పాటు సర్పంచుల పోరం అధ్యక్షుడుగా నియమించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు, గ్రామస్తులు చిగురు నరేష్ ను ప్రశంసల హర్షం కురిపించి శాలువాలతో సత్కరించారు. బంధనకల్ నూతన సర్పంచ్ చిగురు నరేష్ మాట్లాడుతూ మన గ్రామంలో అన్ని సంఘాలతో పాటు అభివృద్ధిలో భాగంగా అందరి సహకారం ఉండాలని కోరాడు. అంతేకాకుండా నేను రైతు బిడ్డగా నిరంతరం అహర్నిశలు కష్టపడుతూ రైతులకు మల్లన్న సాగర్ నీళ్లు మన చెరువు నిండడానికి ఎంతో రాత్రింబవళ్లు కష్టపడి ఎంతో కృషి చేశానన్నారు. ఇలాగే నిరంతరం ఇష్టపడి వెన్నంటు ఉంటానని తెలిపారు. మనమంతా ఒకతాటిపై కుటుంబ సభ్యులుగా ఉంటే మన గ్రామం అభివృద్ధిలో సస్యశ్యామలంగా ఉంటే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చుని అన్నాడు. ఈ విజయాన్ని అందించిన గ్రామ ప్రజలకు, పలువురి సంఘాలకు రుణపడి ఉంటానని తెలుపుతూ ధన్యవాదాలు తెలిపాడు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *