ప్రాంతీయం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్

16 Views

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్.

రామగుండం పోలీస్ కమిషనరేట్.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ గోదావరిఖనిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు,వరద బాధితులు, ట్రాన్స్‌జెండర్లకు ఇంటి స్థలాల ప్రొసీడింగ్లు,సింగరేణి నిర్వాసితులకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరిఖనికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ & అటవీ శాఖ మంత్రి  కొండా సురేఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్  అంబర్ కిషోర్ ఝా , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *