ప్రాంతీయం

చైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు

112 Views

చైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్

సిద్దిపేట జిల్లా,జనవరి 10, తెలుగు న్యూస్ 24/7

ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ తెలియజేశారు.చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని సిపి పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిపి ఆదేశాల మేరకు జిల్లాలో చైనా మాంజా నిల్వలపై దాడులు నిర్వర్తిస్తున్నము అని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండేలా ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రాణ భద్రతకు సహకరించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగించినట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వాళ్ల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *