ప్రాంతీయం

హత్య కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష

35 Views

 

 

హత్య కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, (జీవిత ఖైదు) 50,000/- రూపాయల జరిమానా

నేరం నెంబర్ 17/2017

యూ/ఎస్ 302 ఐపీసీ 

నేరస్తుడి వివరాలు, రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి మాధవ, నివాసం వెంకటాపూర్ గ్రామం, నంగునూరు మండలం.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. యం. విజయ్ కుమార్.,ఐపీఎస్

పోలీస్ స్టేషన్ రాజగోపాలపేట

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 )

ఫిర్యాదిదారుడు రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి సురేందర్ , తన తండ్రి కిరణం దుకాణం వద్ద కాలి స్థలం లో ఉండగా గత ఒకటిన్నర సంవత్సరాల నుండి పన్నెండు గంటల భూమి వివాదం మనసులో పెట్టుకొని ఒక ఇనుప రాడ్ తో తన పాలివరు అగు రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి మాధవ తన తండ్రి సురేందర్ తలపై కొట్టగా, తలకి రక్త గాయం అయిందని , వెంటనే చికిత్స కొరకు హాస్పిటల్ కి తరలించామని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేయడమైనది. దర్యాప్తు జరుగుతుండ గానే చికిత్య పొందుతూ సురేందర్ ప్రాణాలు కోల్పోవడం జరిగినది. అప్పటి సిద్ధిపేట రూరల్ సి ఐ సైదులు పరిశోధన ప్రారంభించి పై నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. తదుపరి పరిశోధన పూర్తిచేసి నేరస్తుడిపై కోర్టులో చార్జిషీట్ వేయడం జరిగింది.ఆరోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ & సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ & సెషన్స్ జడ్జి శ్రీ జయప్రసాద్ గారు, ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన నందున పై నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష, 50 వేల జరిమానా విధించారు.ఫై నేరస్థునికి జైలు శిక్ష పడడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యస్. ఆత్మ రాములు, తన వాదనలు వినిపించారు, ఎస్ఐ శ్రీనివాస్ , ప్రస్తుత ఎస్ ఐ టి. వివేక్ , అప్పటి సి ఐ సైదులు, ప్రస్తుత సి ఐ ఎమ్. శ్రీను , కోర్టు మానిటర్ అధికారులు ,కోర్టు కానిస్టేబుల్ రవి , కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కీలక పాత్ర వహించారు.కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని అభినందించడమైనది. 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *