ప్రాంతీయం

మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు కౌన్సెలింగ్

15 Views

 

 

మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించిన,సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట, డిసెంబర్ 29,

( తెలుగు న్యూస్ 24/7 )

సిద్దిపేట పట్టణంలో వివిధ మండలాలకు చెందిన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయగా మద్యం సేవించి ఉన్నట్లు రిపోర్ట్ రాగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 35 మంది వాహనదారులకు సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓవర్ స్పీడ్/ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం/ రాంగ్ సైడ్ డ్రైవింగ్/సెల్ ఫోన్ డ్రైవింగ్/ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగిన ప్రమాదాల గురించి ఆడియో వీడియో ద్వారా మందుబాబులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వద్దనే ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబానికి తీరని నష్టం జరుగుతుందని మీరు మీ కుటుంబ సభ్యులను భార్య పిల్లలను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని సూచించారు.మరియు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం రోడ్డు పైకి వస్తుందని, యజమాని లేని కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని, మరియు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని, లేకుండా వాహనం నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద, మరియు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఆ వ్యక్తికి గాని వాహనానికి గాని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వారికి కూడా ఇన్సూరెన్స్ వర్తించదని తెలిపినారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు మరియు అతి వేగంతో వాహనాలు నడిపి జరిగిన ప్రమాదాల గురించి పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలని, నడిపే వాహనానికి ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మద్యం సేవించిన వారితో ఈరోజు నుండి మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. కౌన్సెలింగ్ వచ్చిన 35 మందిని విడతలవారీగా కోర్టుకు పంపించడం జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *