ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఎర్రజెండాది
మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి,సిద్దిపేట
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 26, తెలుగు న్యూస్ 24/7
పేదప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసింది కమ్యూనిస్టు లేనని పోరాటాల,త్యాగాల చరిత్ర సీపీఐ పార్టీది అని,అనేక ఉద్యమాల స్ఫూర్తితో సీపీఐ పార్టీ గా ప్రశ్నిస్తూనే ఉంటామని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శుక్రవారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ వద్ద సిపిఐ జెండాను జిల్లా కార్యదర్శి మంద పవన్ ఆవిష్కరించారు.. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు..ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఏర్పడిన సీపీఐ ప్రజల సమస్యల పరిష్కారం కోసం,అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు.నాటి స్వాతంత్ర ఉద్యమ రణరంగ సంగ్రామంలో పాల్గొని దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఘనత సీపీఐ ది అనిఅన్నారు..,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించి,భూమి కోసం, భుక్తి కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం రజాకార్లతో నాడు రణం చేసి,దున్నేవాడికి భూమి నినాదంతో లక్షలాది ఎకరాలు భూమిలేని పేదలకు భూ పంపిణి చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి వుందన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ఆశేష త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని,పీడిత ప్రజల కోసం ఎనలేని త్యాగాలు చేసిందని, బ్యాంకులను జాతీయం చేయ డంలో,ప్రభుత్వ సంస్థల ఏర్పాటులో అగ్రగామిగా నిలిచిందన్నారు. నేడు సీపీఐ 101వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎర్రజెండా రెవరేప లాడే విధంగా కృషి చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని,గత చరిత్ర స్ఫూర్తితో భవిష్యత్ తరాల కోసం ఎర్రజెండా పట్టుకుని పోరాటాలు నిర్వహించాలని అన్నారు..వచ్చే నెల జనవరి18 న సీపీఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం ఖమ్మం లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని, జిల్లా నుండి వేలాదిమంది తరలి వెళ్లాలని ఆయన కార్యకర్తల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్,పట్టణ కార్యదర్శి గజాభీమకర్ బన్సీలాల్, సహాయ కార్యదర్శులు ఎస్కె హారిఫ్,కర్ణాల చంద్రం,జిల్లా కౌన్సిల్ సభ్యులు మిట్టపల్లి సుధాకర్,రామగళ్ల నరేష్,నాయకులు కనకరాజ్,పార్టీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.





