ప్రాంతీయం

ఎస్ టి పి పి లో సివిల్ అధికారుల ఆరాచకాలు

26 Views

ఎస్ టి పి పి లో సివిల్ అధికారుల ఆరాచకాలు.. ఎన్నాళ్ళు ఆడవాళ్ళ ను వేధింపులు
సూపర్వైజర్స్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లక్షలు సంపాదన
ఇప్పటికైనా ఉన్నతఅధికారులు ఇతనిని బదిలీ చేయాలని డిమాండ్
జైపూర్… జైపూర్ పవర్ ప్లాంట్ కొంతమంది అధికారులకి వరంగ మారింది ఎస్టిపిపి లో కొంతమంది ఉద్యోగులు ముఖ్యంగా సివిల్ డిపార్ట్మెంట్లోఎస్ ఈ గా విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కింది స్థాయిలో డబ్బులు వసూలు చేసే ఉద్యోగాలు గుర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానిక ఎమ్మెల్యే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ వారి లేఖలను చెత్త బుట్టలో వేస్తూ తమకు అనుకూలమైన వారిని ఉద్యోగాలుగా నియమిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటీవల ఓ గ్రామం నుండి సివిల్ డిపార్ట్మెంట్లో ఏజీఎం డ్రైవరు తమ బంధువులను ఉద్యోగులగ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సివిల్ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలుగ నిధులు నిర్వహిస్తున్న వారికి గేటుపసులు ఇవ్వకుండా వీరిని పక్కనపెట్టి రిలీవర్లు గా ఉంచి వేరే వారిని ఉద్యోగులకు తీసుకోవడం వీటి వెనుక లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వీటి వెనక ముఖ్యంగా సివిల్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైపూర్ పవర్ పంప్ లో సివిల్ డిపార్ట్మెంట్లో ఎస్ ఈ గా విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్ అనే అధికారి పవర్ ప్లాంట్ ప్రారంభం నుండి ఇక్కడే నిర్వహించడం ఇన్నాళ్లు బదిలీ కాకపోవడం అనేక అనుమానాలకు తావు నిస్తుంది. తనకు నచ్చిన వారికి పదవులు వివిధ ఉద్యోగాలు కట్టబెడుతూ మామూలు వ్యక్తులను కూడా సూపర్వైజర్లుగా నియమిస్తూ నచ్చని వారిని టార్గెట్ చేస్తూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పనిచేసే ప్రదేశాలలో మహిళలను గౌరవ పరచడం చులకన భావనతో చూడడం అయినకు అలవాటని తోటి కార్మికులు వాపోతున్నారు.ఈ అధికారికిమాత్రం బదిలీ కాక పోవడంతో పవర్ ప్లాంట్ లో జరిగే అన్ని పనులలో ఇతర ఉద్యోగుల నియామకాల్లో ఇతని పాత్ర కీలకం గా మారింది తోటి ఉద్యోగులను ఎదగకుండా తమ పరిచయాలను పలుకుబడిని ఉపయోగించి ఇక్కడే ఉంటూ లక్షల్లో అక్రమ సంపాదన సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇతను పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులన్నా భూ నిర్వాసితుల ఉద్యోగుల అన్న అంటే ఇతనికి ద్వేషం పగ. లోకల్ వాళ్లను కూలీలుగా పని చేపించుకుంటూ నాన్ లోకల్ వాళ్లను సూపర్వైజర్ల గా పెట్టుకొని వారి ద్వారా చిన్నచిన్న లేబర్ పనులు చేసే ఉద్యోగాల నుండి పై స్థాయి ఉద్యోగుల వరకు లంచాలు తీసుకొని ఆ డబ్బులను పై స్థాయి ఉద్యోగులకు తమ తమ వాటాలను చెల్లిస్తూ ఇక్కడే స్థిరంగా ఉంటున్నారు పవర్ ప్లాంట్ లో క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయినా గోపి అనే వ్యక్తితో కాంట్రాక్ట్ పనులను సంయుక్తంగా నిర్వహిస్తూ పవర్ ప్లాంట్ లో టెండర్ ప్రక్రియలో వివిధ పనులకు సంబంధించిన విషయాలను వెంటనే లీక్ చేస్తూ ఆ పనులను దక్కించుకోవడంలో ఇతను కీలక వ్యవహరిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తనను తాను రాజుగా భావించుకొని పవర్ ప్లాంట్ లో తనను బదిలీ చేసే ఉద్యోగులే లేరని తనకు ఎవరు లెక్క కాదని తన సహచరుల ముందు డప్పు కొట్టుకోవడం అతనికి చాలా అలవాటు. సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ కొత్తగూడెం జిఎం వెంటనే ఇతనిపై చర్యలు తీసుకొని ఇతనిని బదిలీ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ కార్మిక సంఘాలైన హెచ్ ఎం ఎస్ ఐ ఎన్ టి యు సి బి హెచ్ ఎం ఎస్ ఇతర సంఘాల నాయకులు ఇతనిని బదిలీచేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.ఈ అధికారిని వెంటనే బదిలీ చేయకుంటే సింగరేణి సీఎండి దృష్టికి తీసుకు వెళ్లడానికి కార్మికులు ఏకమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ అధికారిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు పవర్ ప్లాంట్ లోని తన ఉద్యోగస్తులు బయట గుసగుసలు వినబడుతున్నారు. పవర్ ప్లాంట్ అంటేనే మండలంలోని అనేక గ్రామాలలోని ప్రజలు ఉద్యోగులు లేబర్ స్థాయి నుండి సూపర్వైజర్లుగా చాలామంది విధులు నిర్వహిస్తున్నారు వీరు అందరూ శాసనసభ పార్లమెంటుకు జరిగే ఎన్నికలలో తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని నిరసనలు తెలిపిన సందర్భాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా చెన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఇతని అరాచకాల మీద అవినీతి మీద ఉన్నత స్థాయి ఉద్యోగుల చేత విచారణ జరిపి ఇతనిని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ఉద్యోగస్తులు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్