ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 15 మందికి 1,62,500/- రూపాయల జరిమానా

71 Views

 

మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 15 మందికి 1,62,500/- రూపాయల జరిమానా

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 02 ఇద్దరికీ ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 10,000 రూపాయల జరిమానా

మైనర్ వాహనాలు నడిపిన 10 మందికి ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 50,000 జరిమానా

మొత్తం జరిమానా డబ్బులు ₹ 2,22,500/-

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు

సిద్దిపేట జిల్లా, జనవరి 27, తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో  రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 15 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా మంగళవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి  ముందు హాజరుపరచగా విచారణ చేసి 15 మందికి ₹ 1,62,500/- రూపాయల జరిమాన విధించారు, మరియు మైనర్ వాహనాలు నడిపిందుకు గాను ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 50,000 జరిమానా , డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 02 ఇద్దరికీ ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 10,000 రూపాయల జరిమానా విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మైనర్స్ కి వాహనం ఇవ్వకూడదనీ , డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపవద్దని సూచించారు.రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

 

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *