*రామగుండం పోలీస్ కమీషనరేట్*
సైబర్ సారథి అవగాహన కార్యక్రమం.
డిజిటల్ ప్రపంచంలో ప్రతి విద్యార్థి సైబర్ సారధి కావాలి: ఎస్ఐ రమేష్, అనూష.
‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో *“ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్”* పేరుతో 6 వారాల రాష్ట్రవ్యాప్త సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం లో భాగంగా మొదటి వారం లోని *సైబర్ సారధి* తీమ్ లోని 1. 1930 హెల్ప్‌లైన్, 2. గోల్డెన్ అవర్ రిపోర్టింగ్, 3. తక్షణమే ఫిర్యాదు చేస్తే (పి. ఓ. హెచ్) (ప్రొసీడింగ్స్ ఆన్ హోల్డ్) అమలు అవుతుంది, 4. ప్రతిరోజూ ఎన్ని కాల్స్ అందుతున్నాయ్. 5. ప్రతిరోజూ ఎంత మొత్తంలో డబ్బు నష్టం జరుగుతోంది. 6. ఏఐ చాట్‌బాట్ / ఎఐ ఏజెంట్‌ను ఉపయోగించడం ద్వారా రిపోర్టింగ్ సమయాన్ని ఎంత తగ్గించగలం అనే అంశాల పై విద్యార్థుల్లో సైబర్ అవగాహన పెంపునకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ ఐ రమేష్ కృష్ణ వేణి వికాస్ జూనియర్ కళాశాల, ఎస్ ఐ అనూష బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల శారదా నగర్, ఇండో అమెరికాన్ స్కూల్ లలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలు, భద్రతా చట్టాలు, డిజిటల్ హైజీన్‌పై అవగాహన కల్పించేందుకు *‘సైబర్ సారధి’* పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్ఐ రమేష్ అనూష, విద్యార్థులతో మాట్లాడుతూ… సైబర్ నేరాల నివారణకు ఉపయోగపడే తాజా సాంకేతిక పద్ధతులు, ఎఐ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) వినియోగం గురించి, ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ స్కామ్‌లు, ఫోన్/యాప్ ద్వారా మోసాలు జరిగినప్పుడు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని, ఇది దేశవ్యాప్తంగా పనిచేసే అత్యవసర హెల్ప్‌లైన్ అని విద్యార్థులకు తెలియజేశారు. ఏదైనా సందర్బంలో సైబర్ నేరగాళ్ళ చేతిలో బాధితులు మోసపోయినప్పుడు గోల్డెన్ అవర్‌లో ఇచ్చే కంప్లైంట్ వల్ల డబ్బులు ట్రాక్ చేసి నిలిపివేయడం చాలా వేగంగా సాధ్యమవుతుందని గోల్డెన్ అవర్ రిపోర్టింగ్’ ప్రాముఖ్యత గురించి సైబర్ మోసాలు జరిగిన వెంటనే మొదటి 1 గంట సమయం అత్యంత కీలకం అని తక్షణం కంప్లైంట్ ఇవ్వడం వల్ల లాస్ రికవరీ అవడానికి అవకాశం ఎక్కువ అని అవగాహన కల్పించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 కాల్ చేయడమే కాకుండా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిదంగా ఎఐ & చాట్‌బాట్ ద్వారా సైబర్ భద్రత గురించి వివరిస్తూ ప్రస్తుత తరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌బాట్స్ ఎలా సహాయపడతాయో ప్రత్యేకంగా వివరించారు. సోషల్ మీడియా సేఫ్టీ, డేటా ప్రైవసీ, పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్‌లపై అవగాహనా కల్పించారు.
*విద్యార్థులకు సైబర్ నేరగాళ్ళ నుండి సేఫ్టీ గైడ్‌లైన్స్ సూచనలు చేశారు*
• తెలియని లింకులు/ఓటీపీ లు/స్క్రీన్‌షేరింగ్ యాప్స్‌ను ఎప్పుడూ నమ్మవద్దు.
• సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ తప్పనిసరిగా అమలు చేయాలి.
• బలమైన పాస్‌వర్డ్లు, 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వాడాలి
• ఆన్‌లైన్ గేమింగ్/డిజిటల్ పేమెంట్స్‌లో అప్రమత్తంగా ఉండాలి
• మోసం జరిగితే ఆలస్యం చేయకుండా 1930లో కంప్లైంట్ చేయాలి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి విద్యార్థి సైబర్ సారధి కావాలి. తమతో పాటు కుటుంబం, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని” ఎస్ఐ లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో సైబర్ వారియర్ సిబ్బంది, బ్లూ క్లోట్స్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్, టీచర్స్, పాల్గొన్నారు.





