అభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి
మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా
సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్
సిద్దిపేట జిల్లా, జగదేవపూర్, నవంబర్ 30
జగదేవపూర్ ఆదరించండి గ్రామ సేవకుడిగా మీ కుటుంబం లో మీ బిడ్డగా అందరికి అండగా ఉంటూ పనిచేస్తానని గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ అన్నారు.
ఆదివారం వట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలే నాకు శ్రీరామ రక్ష అని చెప్పారు.నా గ్రామ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల కష్టాలను తీరుస్తానని ఆపదలో కూడా అండగా ఉంటానని పేర్కొన్నారు.గ్రామ ప్రజల్లో నేను మీలో ఒక్కడిగా ఉండి బాధ్యతగా పనిచేసి పెడతానని ప్రజలకు సూచించారు.
గ్రామ ప్రజలు యువకులు ఆలోచన చేయాలి పోరాడే చేతికి కత్తి ఇవ్వాలి
మాట్లాడే చేతికి మైక్ ఇవ్వాలి.
అలాగే ఊరిని ఉద్ధరించే వాడికే ఓటు వేయాలి అంతే గాని ఖద్దరు బట్టలు వేసి ఉద్దేర మాటలు చెప్పేటొన్నీ కాదు కాలిన కడుపుతో పోటీచేసే టోనీ ఎన్నుకుంటేనే మన ఊరు మన వట్టిపల్లి అభివృద్ధి అవుతుందనీ యువకులకు,ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నాని అన్నారు,
గ్రామ ప్రజలు అందరూ ఒకసారి ఆలోచించండి. మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే మీ ముందుకు వస్తున్న మీ దీవెనలు మీ ఆశీస్సులు నా పై ఉండాలని మీ బిడ్డగా కోరుకుంటున్నాను.నాకు అధికారం ఉన్నా లేకపోయినా నీకోసమే ఇన్ని రోజులు పని చేశానని ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్న అని తెలియజేశారు.





