ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి – సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్
సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి మందు, డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దు అని సేవా ఫౌండేషన్ చైర్మన్ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు, ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటును అమ్ముకొని ప్రజాసామ్యాన్ని అభాసుపాలు చేయొద్దని కోరారు, ఓటు హక్కును స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రజలు మందు, డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దని సూచించారు, ప్రభుత్వం నోటా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచింద ని, పోటీదారులెవరూ నచ్చకుంటే నోటాను వినియోగించుకోవాలని సూచించారు, ఓట్ నాట్ ఫర్ సెల్ అని అన్నారు, యువత బీరు బిర్యాని అని విలువైన జీవితాలు ఆగం చేసుకోవద్దని,గ్రామం ఎవరితో అభివృద్ధి చెందుతుందో విజ్ఞతతో చూసి ఓటు వేసుకోవాలని సూచించారు..





