ప్రాంతీయం

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

119 Views

*ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి*

*-వేములవాడ వాగు వరద ఉదృతను సందర్శించిన: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ *

వేములవాడ పట్టణం మూలవాగు ప్రవాహాన్ని బుధవారం సందర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని వారు అన్నారు. అందరూ కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని వారన్నారు. ఆరు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల చెరువులు, కుంటలు నిండిన కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వారన్నారు. పాత ఇండ్ల తడిచి కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామని వారన్నారు. వారి వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, నాగుల మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7