శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 15
భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శెట్టి పవన్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.. సందర్భంగా యూత్ గౌరవ అధ్యక్షులు పబ్బాల రమేష్ వంశరాజ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగ ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని రకాలుగా అత్యున్నత స్థానంలో భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా వెళ్లాలంటే యువత అందరూ దేశ సంక్షేమం కోసం పాటుపడాలని యువత సేవా కార్యక్రమాలు చేసి దేశ ప్రగతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మహిళలు చిన్నారులు శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
