ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

40 Views

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను దౌల్తాబాద్ మండల కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఆధ్వర్యంలో జరిపించారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మద్దెల స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తరపున ప్రజల సేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డిని ప్రజల ఆశయాలకు తగ్గట్టు రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు, మల్లారెడ్డి, కర్నల శ్రీనివాస్ రావు, మాజీ సర్పంచులు భద్రయ్య, ఆది వేణుగోపాల్, ఎల్లయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రోంపల్లి ప్రవీణ్, లలిత, కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు బాలశేఖర్ రెడ్డి, వినోద్, కాంగ్రెస్ నాయకులు స్వామి, రమేష్, రైతన్న నందం, లింగం, శ్రీను, సంపత్ రెడ్డి, బండి కృష్ణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *