పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
కపాస్ కిసాన్ యాప్ ను రద్దుచేసి రైతాంగానికి న్యాయం చేయాలి
మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి
జిల్లా కలెక్టర్ కు సీపీఐ ఆధ్వర్యంలో వినతి
సిద్దిపేట్ జిల్లా, నవంబర్ 11
పత్తి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పాత పద్ధతిలో సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని,రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్న కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతిని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు..శుక్రవారం రోజున కలెక్టరేట్ లో ఆయన కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా మంద పవన్ కలెక్టర్ తో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో రైతాంగానికి తీవ్ర నష్టంతో ఆందోళన చెందుతున్న క్రమంలో లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ యాప్ ద్వారా రైతులు స్మార్ట్ ఫోన్ లో ఒకరోజు ముందు స్లాట్ బుక్ చేసుకోవాలని, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సిసిఐ, ఈసారి 7 క్వింటాళ్లకు కుదించడం రైతు కు తీవ్ర నష్టం చేకూరుతుందని,పత్తికి తేమ శాతం 12 నుంచి 20శాతానికి పెంచాలని, రైతులను ఇబ్బందులకు గురి చేసే ఆంక్షలు పెట్టి మరోసారి నడ్డి విరిచే విధంగా రైతన్నకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ కపాస్ యాప్ ను ఎత్తివేసి నేరుగా పాత పద్ధతిలోనే పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టర్ ను కోరారు..ఈ సందర్భంగా కలెక్టర్ హైమవతి స్పందిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని,సీసీఐ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని చెప్పినట్టు మంద పవన్ తెలిపారు..ఆయనతో పాటు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ ఉన్నారు..





