ప్రాంతీయం

కొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలి 

96 Views

కొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలని 

జిల్లా కలెక్టర్ కె. హైమావతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు

సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 6

డెలివరీ కెనాల్ గేట్ లలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గేట్లు మూసివేత జరగడం లేదనీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపగానే జిల్లా కలెక్టర్ కె. హైమావతి డెలివరీ కెనాల్ పరిశీలించి ఇరిగేషన్ డిఈ, ఏఈ లు ప్రయత్నించిన మూతపడకపోగా ఈ సమస్యను జిల్లా ఇంచార్జీ మంత్రి సమాచారం అందించగానే గురువారం జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర నీటి పారుదల అధికారులు బృందం కొండపోచమ్మ సాగర్ జలాశయ డెలివరీ కెనాల్ ను పరిశీలించి మూసివేయడానికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేసి సాంకేతిక లోపం గల కారణాలను గుర్తించి తక్కువ సమయంలో మూత పడేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గేట్లు తెరవడానికి మరియు మూయడానికి భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.

అనంతరం కొండ పోచమ్మ సాగర్ కట్ట వెంబడి గల ముంపు ప్రాంతాన్ని పరిశీలించి పరిష్కారానికై ప్రణాళిక సిద్ధం చెయ్యాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట ఆర్డీఓ చంద్రకళ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎస్ఈ లక్ష్మణ్, సిఈ శివ ధర్మ తేజ, ఈఎన్ సి జెనరల్ హమ్జత్ ఉస్సెన్, ఈఈ శ్రీనివాస్, డిఈ, ఏఈ, తహసిల్దార్లు తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *