ప్రాంతీయం

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన డిసిపి

36 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన మంచిర్యాల డీసీపీ.*

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.,  ఆదివారం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి అక్కడ బందోబస్తు చర్యలు మరియు ప్రస్తుత నీటి ప్రవాహం వివరాలు ప్రాజెక్ట్ వివరాలు గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి దిగువకు 1.44 లక్షల క్యూ సెక్ ల వాటర్ విడుదల చేయడం జరుగుతుంది. కావున దిగువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ అధికారులకు సూచించారు. పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద నీరు వచ్చే లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలను గుర్తించి అవసరమైన మేర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

డీసీపీ వెంట హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేష్  ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్