ప్రాంతీయం

*జిల్లా పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల లపై ప్రత్యేక నిఘా*

137 Views

ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు*

*పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి.*

రాజన్న సిరిసిల్ల జిల్లా ( ప్రజా జ్యోతి)జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్  జిల్లాలో ఉన్న  రౌడీ షీట్లర్ల పై జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ మరియు సబ్ డివిషన్ స్థాయి అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించరూ.ఈ సందర్భంగా ఆయా సబ్ డివిషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న రౌడి షీటర్ల జాబితా మరియు వారియెక్క కదలికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.రౌడీషీట్స్ ఉన్నవారిపై నిరంతరం పోలీస్ నిఘా, పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా రౌడీ షీటర్లు కొన్ని రోజులుగా నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి వారి జాబితాను తయారు చేయాలని వారిపై ఉన్న రౌడి షీట్స్ ను తొలగించడానికి  అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి ఈ సందర్భంగా తెలిపారు..రౌడీషీటర్ల ప్రవర్తనలో ఎటువంటి మార్పులు లేకుండా తరచు నేరాలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై పీడీ యాక్ట్ లు నమోదు చేయాడాం జరిగుతుంది అని అన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్,నాగేంద్రచారి పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7