ప్రాంతీయం

మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు. రాయపోల్ ఎస్ఐ మానస

31 Views

మద్యం సేవించి వాహనదారులు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ కె. మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే 10 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, రెండవసారి మద్యం సేవించి వాహనం నడిపే 15 వేల రూపాయల జరిమానా, కట్టని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులకు ప్రజలకు విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపవద్దు, తల్లితండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని మరియు సైలెన్సర్ మార్చి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి అని పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *