Breaking News

మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ

52 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం ఫలితం

మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

ఫలించిన పెద్దపల్లి ఎంపీ పోరాటం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు గత రెండు సంవత్సరాలుగా వందే భారత్ హాల్టింగ్ కోసం కృషి చేశారు. రైల్వే శాఖకు సింగరేణి ద్వారా పదివేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా, ఇక్కడి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ కృషి ఫలంగా వందే భారత్ హాల్టింగ్ సాధ్యమైంది.

వంశీ గారి కామెంట్స్

మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ కోసం రెండేళ్లుగా ప్రయత్నాలు చేశాను.

మా తాత కాకా వెంకటస్వామి, నాన్న వివేక్ వెంకటస్వామి రైళ్ల కోసం చేసిన కృషిని కొనసాగిస్తున్నాను.

మంచిర్యాల, పెద్దపల్లి రైల్వే సమస్యలపై పోరాటం చేశాను.

రైల్వే కనెక్టివిటీ పెరిగితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

వందే భారత్ హాల్టింగ్ కల్పించినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు.

వివేక్ వెంకటస్వామి గారి కామెంట్స్

పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు 100 రోజుల్లో సికింద్రాబాద్–బెల్లంపల్లి ఇంటర్సిటీ ప్రారంభించాను.

రామగుండం, కేతనపల్లిలో రెండు ఓవర్‌బ్రిడ్జిలు మంజూరు చేశాను.

శబరిమల భక్తుల కోసం కేరళ ఎక్స్‌ప్రెస్‌కి హాల్టింగ్ కల్పించాలని విజ్ఞప్తి.

మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కేంద్రాన్ని కోరాను.

రామగుండం ఫర్టిలైజర్స్‌ను ₹10,000 కోట్లతో రీ ఓపెన్ చేయించాం.

రాష్ట్ర రైతులకు యూరియా కొరతను తీర్చాం.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితో మంజూరు అయిన రైలు హాల్టింగ్‌లు

రామగుండం రైల్వే స్టేషన్

12295 – Sanghamitra SF Express

12578 – Bagmati SF Express

12721 – Dakshin SF Express

22535 – Rameswaram–Baraui SF Express

22669 – Ernakulam–Patna SF Express

పెద్దపల్లి రైల్వే స్టేషన్

12722 – Dakshin SF Express

మంచిర్యాల రైల్వే స్టేషన్

20101 – Vande Bharat (Nagpur–Secunderabad)

బెల్లంపల్లి రైల్వే స్టేషన్

12590 – Gorakhpur SF Express

12771 – Secunderabad–Raxaul SF Express

22669 – Ernakulam–Patna SF Express

12721 – Dakshin SF Express

ప్రత్యేక విజ్ఞప్తి

మంచిర్యాలలో నివసిస్తున్న మార్వాడీ & రాజస్థానీ ప్రజల డిమాండ్ మేరకు, ప్రస్తుతం వారానికి 5 రోజులు నడుస్తున్న Train No. 02625 Dr. MGR Chennai Central – Bhagat Ki Kothi Special ను రోజువారీగా నడిపేలా రైల్వే శాఖను కోరారు.

ఈ నిర్ణయాల వల్ల పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ  ఈ హాల్టింగ్‌లు మంజూరుచేసినందుకు రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *