Breaking News

నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి – కలెక్టర్

32 Views

మంచిర్యాల జిల్లా.

నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి _ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

సెప్టెంబర్ 6, 2025:
వినాయక నవరాత్రుల అనంతరం శోభయాత్ర నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఇందారం పంచాయతీ సెక్రటరీ సుమన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్ మ్యాప్ రూపొందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ల వివరాలను నమోదు చేయడం జరిగిందని, తదనగుణంగా రూపొందించిన రూట్ మ్యాప్ ను ఆయా మండళ్ల నిర్వాహకులు అనుసరించాలని తెలిపారు. నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్, మత్స్యశాఖ, పోలీస్, రెవెన్యూ సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిగే విధంగా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందని, భద్రత దృష్ట్యా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, నిమజ్జన ప్రదేశాలలో క్రేన్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *