ప్రజల సంక్షేమం కోసం నిస్వార్థం గా పనిచేసే రాజకీయ నాయకులనే సమాజం గుర్తిస్తుందని జాతీయ కిసాన్ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పొల్సాని సుగుణాకర్ రావ్,జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, తిమ్మాపూర్ మండలం మక్తపెల్లి కి చెందిన తమ్మిశెట్టి మల్లయ్య ఈనెల 9న మృతి చెందారు. మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంస్మరణ సంతాప సభ ఏర్పాటు చేసారు.రాజకీయ పార్టీ లేవైనా గానీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని అటువంటి సిద్దాంతం తో పనిచేసే నాయకులకే ప్రజల అభిమానం ఉంటుందని అన్నారు. రాజకీయ జీవితంలో గెలుపోటములే ముఖ్యం కాదని అధికారం లేకున్నా ప్రజల కోసం పనిచేసే నాయకులు కొందరే ఉంటారని అన్నారు. తమ్మిశెట్టి మల్లయ్య కూడా మండలంలోని అన్నీ రాజకీయ పార్టీ ల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడని అన్నారు. మల్లయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ స్థానికంగా ఉండే వివిధ రాజకీయ పక్షాలకు నాయకులు మాట్లాడారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిముషాలపాటు మౌనం పాటించారు.జిల్లా ప్రధాన కార్యదర్శులు కళ్లెం వాసుదేవారెడ్డి, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్,అధికార ప్రతినిధులు జానపట్ల స్వామి, బొంతల కళ్యాణ్ చంద్ర,రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,సొల్లు అజయ్ వర్మ,దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి బాల్ రెడ్డి, మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి,గన్నేరువరం అధ్యక్షులు నగునూరి శంకర్,గుండ్రెడ్డి మల్లారెడ్డి,స్థానిక నాయకులు దన్నమనేని నర్సింగారావ్, గాండ్ల శ్రీనివాస్, సీపీఐ అధ్యక్షులు బోయిని తిరుపతి,వైఎస్సార్టిఫి నాయకులు బండమీది అజయ్,ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్,గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,మార్క హరికృష్ణ గౌడ్,బోనాల మోహన్, ఎర్రోజు లక్ష్మణ్,తాళ్లపెల్లి రాజు గౌడ్,కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, గాండ్ల రాము,మండలంలోని బీజేపీ కార్యకర్తలు తదితరులు సంతాప సభలో పాల్గొన్నారు.
