–చికిత్స పొందుతూ యువకుడి మృతి
–దిక్కు తోచని స్థితిలో కుటుంబం
–దాతల సాయం కోసం ఎదురు చూపులు
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 4: ఎన్నో ఆశలతో బతుకు దెరువు కోసం గల్ఫ్‍కు వెల్లి నెల రోజులు తిరగక ముందే క్యాన్సర్‌తో ఇంటికి చేరి దొరికినకాడల్లా చికిత్స కోసం అప్పు చేసి పరిస్థితి విశమంగా మారి ఓ యువకుడు గురువారం మృతి చెందగా బాధిత కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడిపోయిన ఘటన నారాయణపూర్‌లో చోటు చేసుకున్నది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం నారాయణపూర్‌కు చెందిన భారతం కిషన్-సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు శ్రీనివాస్, కుమార్(37), రంజిత్ ఉన్నారు. తానూ గుర్తింపు పొందేలా బతకాలను గంపెడాశతో 9 ఏండ్ల క్రితం గల్ఫ్ వెల్లి ఐదేండ్ల క్రితం ఇంటికి చేరుకున్నాడు. పెల్లి చేసుకుని ఇంటి పట్టునే ఉండి ఎలక్టీషియన్‌గా పని చేస్తుండేది. కరోనా తర్వాత పనుల్లేక అప్పుల పాలయ్యాడు. రెండేండ్ల క్రితం పెంకుటిల్లు మట్టిగోడలు కూలిపోతుండటంతో దాన్ని కూల్చి వేసి చిన్న రేకుల షెడ్డు వేయగా కిషన్ ఇద్దరు కుమారులు మరో చోట ఉంటుండగా కుమార్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. కిషన్ ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చిన్న హోటల్ నడుపుతూ ఉంటే అతనే పోషణ బాధ్యత తీసుకోవడం, కుమార్‌కు అప్పటికే అప్పులుండటంతో గల్ఫ్ వెల్లాలనుకున్నాడు. మూడు నెలల క్రితం కుమార్ దుబాయ్‌కి వెల్లి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో ఓ రోజు కల్లు తిరిగి కిందపడిపోయాడు. పలు మార్లు అదే తీరున జరుగుతుండటంతో వైద్య చికిత్సలు చేయించుకునేందుకు కంపనీ కుమార్‌ను ఇంటికి పంపించింది. దీంతో కుమార్ 3 నెలల క్రితం హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయగా బ్రెయిన్ క్యాన్సర్‌గా తేలింది. వెంటనే నిమ్స్‌లో చేయాలనుకుంటే ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవడంతో బస్వతారకం హాస్పిటల్‌లో సర్జరీ చేయించారు. దీంతో పక్షవాతం అటాక్ కాగా మరో సర్జరీ చేవారు. అయినప్పటికీ ఫలితం లేక పోవడం కీమో థెరఫీ చేస్తే శరీరం సహకరించక పోవడం, తట్టుకోక పోవడంతో పెద్ద వైద్యం చేయాలనుకున్నారు. అప్పటికే అప్పులు తలకు మించిన భారంగా మారాయి. గతంలో ఉన్న అప్పుతో కలిపి వైద్య చికిత్సల కోసం చేసిన అప్పు సుమారు రూ.8 లక్షల వరకు ఉండటంతో చేసేదేమీ లేక నెల రోజుల క్రితం మందులు రాయించుకుని ఇంటికి తీసుకు రాగా గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య భారతి ఉంది. అప్పుల పాలైన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దాతలు స్పందించి సాయం అందించాలని వేడుకున్నారు. సాయం చేయాలనుకునే వారు పోన్‌పే నెంబర్ 9346426974 పంపాలని తెలిపారు.





