రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పి ఆర్ టి యు టి ఎస్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా కనకరాజు ప్రధాన కార్యదర్శిగా శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షునిగా శనిగారపు అనూష మహిళా కార్యదర్శిగా నిమ్మనేని కవిత ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా పి ఆర్ టి యు టీఎస్ రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షుడు షేక్ బాబు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు గరుగుల కృష్ణ హరి వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షేక్ బాబు మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డు లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పూర్ణచందర్ భగవాన్ భూమేష్ గోలి ఆనంద్ జయరాం తిరుపతి ప్రభాకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు





