Breaking News

వరద నీటిలో చిక్కుకున్న వారు క్షేమం

228 Views

రెండు హెలికాప్టర్ల ద్వారా ఎదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఆర్మీ అధికారులు

ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ

గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, అక్కడే చిక్కుకుపోగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు. హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు ఈరోజు చేరుకొని ఐదుగురిని క్షేమంగా గమ్యం చేర్చారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధికార యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *