
ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండులో
అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా
ఎల్లారెడ్డిపేట అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాదం స్థానిక కొత్త బస్టాండులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులకు అన్నదానం శ్రీ రామోజీ శేఖర్ సహకారంతో చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చకిలం మధు, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు దేవరాజు, శ్రీను గురు స్వామి, చంద్రమోహన్ రెడ్డి, కందుకూరి రవి, రాజు గౌడ్, వెంకటేష్, చింతరాజు, జిల్లా శ్రీనివాస్, శ్రీ రామోజు భాస్కర్ , జిల్లా రాజు తదితరులు పాల్గొన్నారు.





