– పట్టుకున్న పోలీసులు, ముగ్గురిపై కేసు నమోదు..
స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు జరపడం నిషేధం అయినప్పటికీ కూడా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో యేదేచ్చగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, స్థానికులు తిమ్మాపూర్ ఎస్సై కి సమాచారం అందించడంతో వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని అక్రమ మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు..
తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ..
అలుగునూరు లో ఓ ఇంటిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నరనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా 33 వేల విలువగల మద్యన్ని స్వాధీన పరుచుకున్నామని అన్నారు. అక్రమ మద్యం అమ్ముతున్న ముంజ మంజయ్య,ముంజ లక్ష్మణ్,బుర్ర లక్ష్మణులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇలా ఎవరైనా చట్ట విరుద్ధంగా మధ్య అమ్మకాలు జరిపితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.