రామగుండం పోలీస్ కమీషనరేట్
పోలీస్ స్టేషన్ లో అన్ని విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ డిజిపి అబిలాష్ బిస్త్
పెద్దపల్లి డీసీపీ కార్యాలయం లో రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధి లోని డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్ ఓ మరియు మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది తో సమావేశం నిమిత్తం ఈరోజు పెద్దపల్లి డీసీపీ కార్యాలయం చేరుకున్న గౌరవ శ్రీ అబిలాష్ బిస్త్, RBVRR, డైరెక్టర్, హైదరాబాద్, తెలంగాణ గారిని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గారు మర్యాదపూర్వకంగా మొక్కను అందచేసి స్వాగతం పలకగా అనంతరం ఏ ఆర్ సాయిదా దళ సిబ్బంది గౌరవ వందనం అందించడం జరిగింది.
అనంతరం మేడమ్ డీసీపీ/ఏసీపీ/ఎస్ ఎచ్ ఓ మరియు మహిళా పోలీసు సిబ్బందితో డ్యూటీ లు , పోస్టింగ్‌లు, సెలవులు, పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న డ్యూటీ ల గురించి, పని చేయు ప్రదేశం లో సమస్యలు, కుటుంబ తరుపున ఏవైనా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మహిళా సిబ్బంది, మెన్ తో సమానం గా పిటిషన్ ఎంక్వయిరీ, బ్లూ క్లోట్స్, పెట్రోలింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీ, కోర్ట్ డ్యూటీ, పోలీస్ స్టేషన్ డ్యూటీ లతో పాటు బయట డ్యూటీ లు చేయడానికి దైర్యం గా సిద్ధం గా ఉన్నాడాలన్నారు. పోలీస్ స్టేషన్ లో స్కూటీ లు ఏర్పాటు చేయాలి, మహిళా సిబ్బంది కి డ్రైవింగ్ శిక్షణ ఏర్పాటు చేయాలి అని అధికారులకు సూచించారు.
ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, ఎస్ఐ లు పాల్గొన్నారు.
