*పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో రామగుండం ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం*
రామగుండం ఆస్పత్రి నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.
నిర్లక్ష్యానికి కేరాఫ్ పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం.
రామగుండంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో పెద్దపల్లి ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
ఆసుపత్రి నిర్మాణానికి బడ్జెట్ విడుదలైన కూడా స్థానిక పరిపాలన వైఫల్యంతో ఆస్పత్రి నిర్మాణం ముందుకు పడటం లేదు.
పెద్దపెల్లి జిల్లాలో ఇప్పటికే వైద్యం కోసం చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల అప్రమత్తత వల్ల పెద్దపల్లి ప్రాంత ప్రజలు వైద్యం అందుబాటులో లేక అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి నిర్మాణం అయ్యేవరకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోరాటం ఆగదని ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా తన గళం వినిపించారు.
