Breaking News

మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు

9 Views

మంచిర్యాల జిల్లా.

రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన వెరబెల్లి మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు.

హైదరాబాద్ లో తెలంగాణ రైఫిల్, పిస్టల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ కు చెందిన వెరబెల్లి రవీందర్ రావు కుమార్తె వెరబెల్లి మహతి S26 10 మీటర్ రైఫిల్ షూటింగ్ లో 2 వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి  హాజరై విజేతలకు మెడల్స్ అందజేశారు. గతంలో మహతి జాతీయ స్థాయిలో కూడా రైఫిల్ లో పలు మెడల్స్ గెలుచుకుంది.

ఈ సందర్భంగా వారి నివాసంలో బీజేపీ నాయకులు మహతి ని సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, గాజుల ముఖేష్ గౌడ్, పట్టి వెంకట కృష్ణ, బియ్యాల సతీష్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, మెట్టుపల్లి జయరామ రావు, బోయిని హరి కృష్ణ, బింగి ప్రవీణ్, బోయిని దేవేందర్, బెల్లంకొండ మురళి, రెడ్డిమల్ల అశోక్, రాజబాబు, పెద్దన్న, ఓడ్నాల రవీందర్, రామగిరి లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్