మంచిర్యాల జిల్లా :
జైపూర్ లోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసిన మంత్రి.
మందమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్వర్గీయ అసోసియేట్ ప్రొఫెసర్ జి లింగయ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నోటుబుక్కులు, పెన్నులు ఇతర విద్యా సామాగ్రి పంపిణీకి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి.
మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో 14 మంది డిపెండెంట్ల కు కారుణ్య నియామక పత్రాలను అందజేసిన మైనింగ్,కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.పాల్గొన్న జీఎం దేవేందర్ ,ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య.
కేతన్ పల్లి మున్సిపాలిటీ 14వ వార్డులో 28.లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్, డ్రైనేజ్, చిల్డ్రన్ ప్లే ఏరియా , ఓపెన్ జిమ్, పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.
కేతన్ పల్లి మున్సిపాలిటీ ఫ్లైఓవర్ వద్ద 15 లక్షల రూపాయలతో నిధులతో నిర్మించిన మెట్లు ప్రారంభోత్సవం చేసిన మంత్రి.
మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్..
బొగ్గు గని కార్మికులంటే కాకా వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండే, కేంద్రమంత్రి గా కాకా వెంకటస్వామి ఉన్న హయంలో సింగరేణి సంస్థ నష్టాల్లో ఉందని మూసివేసే క్రమంలో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో మాట్లాడి ఎన్టీపీసీ నుండి 4వందల కోట్ల రుణం ఇప్పించి సంస్థను కాపాడి లక్ష మంది ఉద్యోగులకు బాసటగా నిలిచారు.సింగరేణి కార్మికులు క్రమశిక్షణ తో ఉత్పత్తి సాధించడం వల్లనే సింగరేణి సంస్థ లాభాల బాటలోకి వచ్చింది.తెలంగాణ లోనే అతి పెద్ద ప్రభుత్వ రంగసంస్థ ఐన సింగరేణి సంస్థను కాపాడుకోవాలి.బిఆర్ఎస్ పదేండ్ల పాలనలో సింగరేణి సంస్థ అభివృద్ధి కి పాటు పడలేదు.కేవలం సింగరేణి నిధులకే ప్రయారిటీ ఇస్తూ వాడుకుంది.కొత్త గనులు,కొత్త ఉద్యోగాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా.కేంద్ర ప్రభుత్వం చేపట్టే సింగరేణి టెండర్లలో సింగరేణి సంస్థ నే నేరుగా పాల్గొనేటట్లు చర్యలు చేపడుతా.
