Breaking News

గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

5 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు: గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి.

మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ వింగ్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ నగర్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్,సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… కొంతమంది వారి స్వలాభం కోసం యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి భవిష్యత్తు నాశనం చేయడం జరుగుతుంది. నేటి యువత చెడు అలవాట్లకు బానిసలై చివరకు నేరాలకు పాల్పడుతున్నారని, మంచి నడవడికపైనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, వారితో పాటు గంజాయి అమ్మే వారిపై మరియు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. యువత, ప్రజలు మీమీ చుట్టుపక్కల గాని మీ కాలనీ లో కానీ ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు,

సోషల్‌ మీడియాలో వస్తున్న అనేక వెబ్‌సైట్ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో రామగుండం సైబర్ క్రైమ్స్ పోలీసులు సైబర్ నేరాలపై, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నాం అని సీఐ అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు యువత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్