నగరంలోని పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్
చేయండి
జనవరి 24
నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేయాలని నగరంలో నేడు పిడిఎస్యు సభ్యులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పి డి ఎస్ యు నగర అధ్యక్షుడు సుకూర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీ గా అప్డేట్ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి పలు జిల్లాల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపి ఇంజనీరింగ్ కళాశాలగా అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అప్డేట్ చేస్తుందని నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలిపారు
