మంచిర్యాల జిల్లా.
13 బెటాలియన్ గుడిపేట నందు ఆత్మహత్యల నివారణ సదస్సు.
13 బెటాలియన్ గుడిపేట నందు ఆత్మహత్యల నివారణ సదస్సు లో ముఖ్య అతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్ మరియు డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాలలో సామాజికంగా, మరియు బిసి ఉద్యమంలో ముందు ఉండి నడిపిస్తూ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్పు కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి మనోహర్ కి గుర్తించి తెలంగాణ నేత్ర అవయవాల శరీర దాతల అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ పరికిపండ్ల అశోక్ నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ , అదేవిధంగా బెటాలియన్ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గా ఎన్నిక చేసినందుకు డాక్టరు పరికిపండ్ల అశోక్ కి, మరియు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ప్రజలలో నేత్రదానము, అవయవాల దానము శరీర దానం పైన మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తృతంగా ప్రజలకి అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా అన్నారు.
