ప్రాంతీయం

తప్పిపోయిన పాప ను కుటుంబ సభ్యులకు అప్పగించిన 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు

16 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్.

తప్పిపోయిన పాప ను కుటుంబ సభ్యులకు అప్పగించిన 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు.

గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తప్పిపోయిన 5 సంవత్సరాల ఓ పాపను గోదావరిఖని 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తప్పిపోయిన పాప సమాచారాన్ని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది బ్లూ క్లోట్స్ సిబ్బంది కి సమాచారం అందించగా బ్లూ క్లోట్స్ సిబ్బంది వెంటనే స్పందించి చిన్న పాప తల్లితండ్రుల వివరాలు గుర్తించడం కోసం ఫోటో ను సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేయగా పాప బ్లూ క్లోట్స్ పోలీస్ సిబ్బంది వద్ద ఉన్నదనే సమాచారం తో పాప తల్లితండ్రులు పోలీస్ సిబ్బంది ని సంప్రదించగా పాపని తల్లితండ్రులకు అప్పగించడం జరిగింది. పాప ఎలా తప్పోయింది అని తెలుసుకొనగా పాప తల్లితండ్రులు లక్ష్మి నగర్ లో షాపింగ్ నిమిత్తం రాగా వారి వద్ద నుండి ఆడుకుంటూ పాప లక్ష్మి నగర్ నుండి గాంధీ చౌక్ వైపు దారి మరిచిపోయి రావడం జరిగింది. తప్పిపోయిన ఆ చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించిన బ్లూ క్లోట్స్ సిబ్బంది తిరుపతి, నవీన్ లను 1టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తమ పాప ను అప్పగించిన 1 టౌన్ పోలీసులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్