ప్రాంతీయం

మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

39 Views

మంచిర్యాల జిల్లా.

మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని  అధికారులకు  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ పరిధిలోనీ పాత మంచిర్యాల ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. గుత్తేదారుల సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్