ప్రాంతీయం

మందమర్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

27 Views

మంచిర్యాల జిల్లా మందమర్రి.

మందమర్రి మున్సిపాలిటిలోని 18 వ వార్డు గాంధీ నగర్ లోని పలు అభివృద్ధి శంకుస్థాపనకు విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఈరోజు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో కొత్త గనులలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని, కొత్త గనులు తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ కోల్పోయే అవకాశం ఉందాని ఎమ్మెల్యే వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు.

బొగ్గు నిల్వలు లేవని బొగ్గు గనులు మూసివేస్తూ కొత్త గనులు తీసుకో రాకపోతే కార్మికుల శాతం తగ్గుతుంది, బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపిందని సీఎండీ తనతో అన్నారని. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. సింగరేణి సంస్థకు అర్ట్మెంట్ అయిన గనులకు కేంద్ర ప్రభుత్వానికి 18 శాతం టాక్స్ సింగరేణి సంస్థ చెల్లిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్