బెల్లంపల్లి నియోజకవర్గం:
కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ₹63,103,596/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి అమ్మాయి వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తారని, వారికి బాసటగా ఉండడానికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, ఎమ్మార్వో జోష్ణ , సంబంధిత అధికారులు, లబ్ధిదారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
