ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.
యుద్ధంలో విజయం సాధించాలని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు ,:పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, మన భారత త్రివిధ దళాలు, సైన్యం కు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా విజయవంతంగా ముందుకు దూసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని, భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులతో పాటు మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, నాయకులు ఏమాజీ, సంగీత గోవర్ధన్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.





