అపవాదాలు నమ్మకండి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ జూన్ 24
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని 4 మార్కెట్ కమిటీలకు సంబంధించిన పదవులు ఇంకా ఎవరికి ఇవ్వలేదని , అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరిని సంప్రదించిన తర్వాతనే మార్కెట్ కమిటీ చైర్మన్ లను, వైస్ చైర్మన్ లను, డైరెక్టర్లను, అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి నాగేశ్వరరావు అన్నారు.
వార్తా పత్రికలలో వస్తున్న పుకరులను నమ్మవద్దు అని అన్నారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము అని అన్నారు . ఈ మేరకు అందరికీ న్యాయం చేయాలని గజ్వేల్ నియోజక వర్గంలోనీ అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి మరియు ఉమ్మడి జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ కి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో టీపీసీసీ.రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు , కప్పర భాను ప్రకాష్ , బయ్యారం మల్లా రెడ్డి , సిద్దిపేట జిల్లా ఎస్ సి.డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్, వెంకట్ రామ్ రెడ్డి, నాయిని యాదగిరి , రాచకొండ ప్రశాంత్ శ్రీనివాస్ గుప్త. వడ్ల కొండ రవీందర్ గౌడ్, అనిల్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
