ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…
పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని బ్లూ కోల్ట్ టీమ్‌లు 24 గంటలపాటు
ముమ్మరంగా గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.
లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల మహజన్.
పోలీస్ అధికారులు,సిబ్బంది నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలను ప్రతి ఒక్కరు విధిగా సందర్శించి ఏమైనా లోటు ఉన్నట్లయితే వెంటనే పై అధికారులకు తెలపాలన్నారు.పోలీస్ సిబ్బందికి కేటాయించిన గ్రామాలను తరచు పర్యటిస్తూ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.స్టేషన్ పరిధిలోగల సమస్యాత్మక , సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు.
-ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట్రావుపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావుపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది డ్యూటీ రిజిస్టర్, వాహనాల తనిఖీ రిజిస్టర్ తనిఖీ చేసారు.
అనంతరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తో మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.అక్రమ మద్యం, డబ్బు ,ప్రజలను ప్రలోభాలకు గురి చేసే విలువైన వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు.ప్రజలు యాభై వేల కంటే ఎక్కువ నగదు తీసుకవెళ్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని లేని యెడల సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ వెంట సి.ఐ సదన్ కుమార్, ఎస్.ఐ శేఖర్ రెడ్డి ,సిబ్బంది ఉన్నారు.
