ప్రాంతీయం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో మంచిర్యాల నియోజకవర్గంలో పాదయాత్ర – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

15 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల:

ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరియు హాజీపూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి  మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి SIR అంశంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించి, వాస్తవాలను తెలియజేస్తామని అన్నారు. మూడేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీ SIRపై అర్థరహిత ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. త్వరలో చేపట్టనున్న పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి పురుషోత్తం, రంగ శ్రీశైలం, గడ్డం స్వామి రెడ్డి, కుర్రె చక్రవర్తి, జోగుల శ్రీదేవి, రమణ రావు, వైద్య శ్రీధర్, కమలాకర్ రావు, కస్తూరి నాగరాజు, ఆకుల అశోక్ వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *