ముస్తాబాద్, మార్చి 8 (24/7న్యూస్ ప్రతినిధి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి గ్రామపంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మహిళలకు గల హక్కులు మరియు సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించడం వంటి విషయాలపై చర్చించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రత్యేక అధికారి పాల్వాయి కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కావటి పరశురాములు, మాజీ సర్పంచ్ కాషోల్ల పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, వివో అధ్యక్షురాలు చింతకింది లావణ్య , వివోఎ నగునూరి జమున, అంగన్వాడీ టీచర్ రోడ్డ బాలలక్ష్మి, ఆశా వర్కర్ నల్ల భారతి మహిళా సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
