మంచిర్యాల జిల్లా
ఆర్టీసీ బస్సులో మీరేమైనా పోగొట్టుకున్నారా! అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ పైన బస్సు కండక్టర్ రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోయారా! అయితే ఏం పర్వాలేదు వెంటనే ఈ నెంబర్కు 040 – 69440000 కాల్ చేసి టికెట్ పైనున్న బస్సు నెంబర్ ని మరియు టికెట్ వివరాలు చెబితే మీరు మర్చిపోయిన డబ్బులు ఆర్టిసి నుండి ఫోన్ పే ద్వారా మీకు పంపిస్తారు. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సయిన అదే టికెట్ తో మరొక బస్సులో మీ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో ఏమైనా వస్తువులు మర్చిపోయిన మరియు పోగొట్టుకున్న టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ వస్తువులను మీరు పొందవచ్చు.
