*బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకని భాను
బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ప్రభుత్వం మరియు మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అంకని బాను, మ్యాకల మునీందర్ మరియు రమేష్ మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్లస్టర్ హెల్త్ సెంటర్(సి హెచ్ సి లో) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళల్లో ఐదుగురు చనిపోవడం దురదృష్టకరమని దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పాలనలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తమైందని ఏ ఒక్క సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, విద్య వైద్యం నిర్లక్ష్యానికి గురవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి వీడనాడి మెరుగైన విద్యా, వైద్య విధానం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, చనిపోయిన వారి కుటుంబానికి ఒక ఉద్యోగం చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 790మంది నిరుద్యోగుల నుంచి లక్షల్లో రూపాయలు వసూలు చేసి తీరా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అప్పులు తెచ్చి ఇవ్వడం వల్ల ఉద్యోగం రాక అప్పులు కట్టలేక ముంజ హరీష్ గౌడ్ అనే నీరుద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి 50 లక్షలు ఎక్స్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.దీనీకి కారాకులైన పెద్దపల్లి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను వేంటనే ఎం ఎల్ ఏ పదవికి రాజీనామా చేయించి పార్టీ నుంచి తొలగించాలని ప్రభూత్వన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెళ్లి స్వామి గౌడ్, జిల్లా నాయకులు బందెల దేవరాజ్, కార్యదర్శులు దర్శనం గంగాధర్, బొడ్డు మహేందర్, లింగంపల్లి మధుకర్, వేములవాడ,సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు నంద్యా నాయక్,చెక్కపెల్లి శ్రీనివాస్, నియోజకవర్గప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, కార్యదర్శి ఇసంపల్లి కొమురయ్య, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
