ప్రాంతీయం

ఏబీసీడీ వర్గీకరణ ఆమలుకై దండోరా దండయాత్ర

51 Views

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు ఎనగందుల శివాజీ అధ్యక్షతన తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బారి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిలుక రాజనర్సు మాట్లాడుతు ఏబీసీడీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లు గా అలుపెరుగని పోరాటాలు చేశాం. ఎందరో మాదిగ వీరులు అమరులైనారు. వారి త్యాగ ఫలితమే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ. మా పోరాటానికి యావత్ సమాజం మొత్తం మద్దతు ఇచ్చాయని, అదే కాకుండా మన రాష్ట్రo లోని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరములో వర్గీకరణ చేయడంతో మన మాదిగలకు దాదాపుగా 22 వేల ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడు కొందరు మాల సామాజిక సంపన్నులు తమ ఆర్థిక బలంతో కుట్రలు చేసి కోర్టుల ద్వారా నిలిపివేయించారు.అయినా కూడా రాజ్యాంగ బద్దంగానే ఉద్యమాలు చేశాము. ఎస్ సి వర్గీకరణ ఉద్యమం న్యాయమైనది కాబట్టే రాష్ట్రo లోని అన్ని రాజకీయ పార్టీలు.గత కాంగ్రెస్ ప్రభుత్వాo.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ లో తీర్మానం చేసారు.బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కూడా అసెంబ్లీలో ఎస్ సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.కేంద్రం లో ఉన్న బీజేపీ ఎస్ సీ వర్గీకరణ కు అనుకూలంగా ఉంది. అదే కాకుండా గతంలో 1965 లో లాల్ బహదూర్ శాస్త్రి వేసిన లోకూరు కమిషన్ భారత మాజీ ప్రధాని మన్ మో హన్ సింగ్ వేసిన ఉష మెహ్రా కమీషన్ కూడా సీ ఎస్ వర్గీకరణ కోసం వేసిన కమిషన్లు వర్గీకరణకు అనుకూల రిపోర్ట్ ఇచ్చాయి. అలాగే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన శ్రీ రామచంద్ర రావు కమిషన్ వేస్తే అది కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే రిపోర్ట్ చేశారు. అదేకాకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది. రాష్ట్ర పతి కూడా మాకు మద్దతుగా ఉన్నారు. చివరకు మన భారత దేశ అత్యున్నత న్యాయస్థానం మాకు అనుకూలంగా చీఫ్ జస్టిస్ చంద్ర చుఢ్ నాయకత్వాన ఆరుగురు సభ్యుల ధర్మాసనం మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. అంతే కాకుండా 2024. ఆగస్టు 1వ తేదిన సుప్రీమ్ కోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించి వర్గీకరణ అమలు చేస్తా అని నిండు అసెంబ్లీ లో ప్రకటన చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే .రాహుల్ గాంధీ అనుకూలంగా ఉంటే కేవలం మాల ఏమ్మెల్యే అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి తన స్వలాభం కోసం మాలలను రెచ్చగొడుతూ కృత్రిమ ఉద్యమాలు చేస్తూ ఏబీసీడీ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గడ్డం వివేక్ వెంకటస్వామి తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది. గడ్డం వివేక్ వెంకటస్వామి కేవలం మాల ఓట్లతోనే గెలవలేదు. గెలుపులో మాదిగ జాతి కూడా ప్రధాన భూమిక పోషించారనే విషయాన్ని మరవద్దన్నారు. ఏబీసీడీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వారిని రాష్ట్రoలో మాదిగల ద్రోహిగా నిలబెడుతమని మాదిగ హక్కుల దండోరా హెచ్చరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల దుర్గయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి రాజ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణ పల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షుడు కల్లేపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7