Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డాక్టరేట్ పట్టా పొందిన తనయుడు జీషన్…..

102 Views

: డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్
ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో 97% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కామినేని మెడికల్ కళాశాలలో డాక్టర్ పట్టాను పొందారు. ఈ సందర్భంగా జీషన్ కు ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్,జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా జర్నలిస్టు మజీద్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *