ప్రాంతీయం

రైతు భరోసా పేరిట అన్నదాతలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ – దివాకర్ రావు

36 Views

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట.

*రైతుభరోసా పేరిట సీఎం రేవంత్ అన్నదాతలకు చేసిన దారుణమైన దగాపై లక్షెట్టిపెట్ అంబేద్కర్ చౌరస్తా లో నిరసన కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.*

అనంతరం వారు మాట్లాడుతూ

ఏటా రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని ఏడాది పాటు ఊరించి ఊరించి చివరికి 12 వేలే ఇస్తామని రైతుల ఉసురు పోసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు ఇచ్చిన ప్రధాన హామీకి పాతరేసినందుకు రైతు డిక్లరేషన్ కాపీకి, గ్యారెంటీ కార్డులకు గొయ్యి తీసి బొందపెట్టే కార్యక్రమం, పిండం పెట్టే కార్యక్రమం,మాయ మాటలు చెప్పి రైతన్ననల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి.ఈ ప్రభుత్వ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగా నయవంచన అని మరోసారి రుజువైంది. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు,గతంలో మేము ఇచ్చిన రైతుబంధును బిచ్చమేస్తున్నారు అంటూ విమర్శించిన కాంగ్రెస్… ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచి మోసం చేయడమంటే రైతన్నను అవమానించడమే.    మా ప్రభుత్వం రైతుబంధు 72 వేలకోట్లు, రైతు రుణమాఫీ 27 వేల కోట్లు మొత్తంగా లక్ష కోట్లను రైతన్నల ఖాతాల్లోకి పంపింది.కానీ ఈ కాంగ్రెస్ ఉన్న పథకాలను ఉడగొడుతుంది, రైతన్న నడ్డి విరుస్తుంది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి ఒక్క రైతన్నకు ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసాను అమలు చేయాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. అప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో లక్షెట్టిపెట్ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్,మండల అధ్యక్షులు పాదం శ్రీనివాస్ చుంచు చిన్నయ్య, దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిదులు, నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్