ప్రాంతీయం

శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరణ

40 Views

రామకోటి సంస్థ ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారి రామ, శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరించిన

MLC యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు

రామకోటి రామరాజు నిరంతర రామభక్తి అమోఘం అని ప్రశంస

సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 19

శివ కేశవులకు బేధం లేదని శృంగేరి పీఠం సంస్థ వారు చేపట్టిన రామ, శివ కోట్లాది లిఖిత మహాయజ్ఞం ఖరపత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గురువారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆవిష్కరించారు.

కర పత్రాలలో రామ, శివ నామాలు లిఖించి అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చైర్మన్ రాజమౌళి, ఆకుల నరేష్ బాబు,అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గుర్తించి శృంగేరి పీఠం వారు చేపట్టిన రామ, శివ లిఖిత మహాయజ్ఞంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం అన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ శివ రామ లిఖిత మహాయజ్ఞంలో పాల్గొనే అవకాశం నేడు రామకోటి రామరాజు ద్వారా రావడం సంతోషం అన్నారు. రామకోటి రామరాజు గారు మీకు అందించే కరపత్రాలలో లిఖిత నామాలు లిఖించి రామకోటి రామరాజుకు అందజేయాలని కోరారు.

సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ భగవన్నామము మించిన నామము మరొకటి లేదన్నారు. రామకోటి రామరాజు గారు మీకు అందించే కర పత్రాలలో నామాలు లిఖించి భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు.

శృంగేరి పీఠం నిర్వాహకురాలు వేముల జయదుర్గ గారికి గారికి పూర్తిచేసి త్వరలో రామకోటి రామరాజు అందజేయనున్నాడు.

ఈ కార్యక్రమంలో కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రాంచెంద్రం, దుబాకుంట మెట్రాములు నంగునూరి సత్యనారాయణ, కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవేందర్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్