*ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ పీఆర్సీ, డీఏ మరియు బిల్లుల వెంటనే చెల్లించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్*
ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ఉపాధ్యాయులతో సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలు తపస్ సభ్యులు రఘునాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్ లో పీఆర్సీ, డీఏ మరియు పెండింగ్ లో బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం పై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీ లో ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తామని తెలియజేశారు. ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈనెల 23 నుండి మరొకసారి పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేసుకొని వారు తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు.
